Eagle Teaser: ఈగల్ టీజర్ రిలీజ్‌..గత్తర లేపిన రవితేజ

-

మాస్ మహారాజ్ రవితేజ ఈ దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించింది. ఇక ఇప్పుడు రవితేజ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇటీవలే గోపీచంద్ మలినేనితో చేయాల్సిన RT4GM చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో పట్టాలు ఎక్కించాడు. ఇక సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ‘ఈగల్’ మూవీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టడానికి సిద్ధమయ్యాడు.

EAGLE Teaser out

ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే.. మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఈగల్’ నుంచి అప్డేట్ వచ్చేసింది. సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ లోని రవితేజ లుక్, మ్యూజిక్, ఫైటింగ్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి బరిలో ‘ఈగల్’ ఉండగా…. టీజర్ తో మూవీపై భారీ అంచనాలు పెంచేసింది. ఇప్పటికే ‘దసరా’కు రిలీజ్ అయిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news