ఎర్ర‌చీర‌లో శ్రీ‌కాంత్ ఆ పాత్ర‌కి సెట్ అవుతాడా…?

48

మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన  చిత్రం ‘ఎర్రచీర’ఈ హర్రర్ చిత్రంలో శ్రీకాంత్, సాయి తేజ‌స్విని సి.హెచ్ సుమన్‌బాబు, కారుణ్య, సంజ‌నా శెట్టి, కమల్‌ కామరాజు, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేష్‌లు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. సి.హెచ్ సుమ‌న్ బాబు స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలోని రాజ‌మండ్రి రైలెక్కి చెక్కేస్తారు లిరిక‌ల్ వీడియో సాంగ్ ను ఇటీవ‌లె హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్ లో ఢ‌మ‌రి మ్యూజిక్ కంపెనీ ద్వారా రిలీజ్ చేసారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టార్ డైరెక్ట‌ర్ బాబీ, సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌ప్ర‌కాశ్ పాట‌ను, ఢ‌మ‌రి మ్యూజిక్ కంపెనీ లోగోను  ఆవిష్క‌రించారు. అలాగే  సినిమా రిలీజ్ డేట్ పోస్ట‌ర్ ను నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్యనారాయ‌ణ‌, బిగ్ సిడీని వ‌క్త‌లంతా క‌లిసి ఆవిష్క‌రించారు.

అనంత‌రం బాబి మాట్లాడుతూ, ` ఐట‌మ్ సాంగ్  బాగుంది. సుమ‌న్ గారు ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా రెండు బాధ్య‌త‌ల‌ను  నిర్వ‌ర్తించ‌డం గొప్ప విష‌యం. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలి` అని అన్నారు.

ద‌ర్శ‌క‌, నిర్మాత స‌త్య సుమ‌న్ బాబు మాట్లాడుతూ, ` బాబిగారు చేతుల మీదుగా ఈ పాట రిలీజ్ అవ్వ‌డం సంతోషంగా ఉంది. ఆయ‌న బిజీ షెడ్యూల్ లోనూ మా సినిమాకు కొంత స‌మయం కేటాయించి వ‌చ్చినందుకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు. ఢ‌మ‌రి  మ్యూజిక్ ద్వారా పాట‌ల‌ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం.  ఈ కంపెనీ నాదే.  కొన్ని కార‌ణాల వ‌ల్ల మ్యూజిక్ కంపెనీ స్టార్ట్ చేసా. మా కంపెనీ స‌క్సెస్ అవుతుంద‌న్న న‌మ్మ‌క ఉంది. ఇందులో శ్రీకాంత్ గారు అఘోర పాత్ర‌లో క‌నిపిస్తారు. ఇప్ప‌టివ‌ర‌కూ శ్రీకాంత్ ను ఇలాంటి పాత్ర‌ల్లో చూసింది లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పాత్ర‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కుతుంది. డిసెంబ‌ర్ 27న సినిమా రిలీజ్ చేస్తాం` అని అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు ప్ర‌మోద్ మాట్లాడుతూ, ` మొత్తం 5 పాట‌లున్నాయి. రైలెక్కి రాజ‌మండ్రి చెక్కేస్తారు పాట‌ను రాజ‌మండ్రికి  చెందిన క‌డియం ర‌వి రాసారు. గీధామాధురి పాడింది. పాట కోసం చాలా ట్యూన్స్ చేసాం. అలాగే మిగ‌తా పాట‌లకు మంచి ట్యూన్స్ కుదిరాయి` అని అన్నారు.