ఇక్కడ హిట్ అయినా.. వారికి అక్కడ వర్కవుట్ అవ్వటం లేదు..!

టాలీవుడ్ లో యువతరం దూసుకెళ్తోంది. కొత్త తరం, కొత్ర కథలతో సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కొత్త తరం దర్శకులు తమ ప్రతిభాను నిరూపించుకుంటూ టాలీవుడ్ లో సాగిపోతున్నారు. ఇప్పుడు నవతరం హవానే కొనసాగుతోందంటే కారణం కొత్తదనమే. టాలీవుడ్ యువ దర్శకులు విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ తమని తాను నిరూపించుకుంటున్నారు.

dairecter
dairecter

కానీ. మన తెలుగు రాష్ట్రాల్లో వర్కవుట్ అయినా చిత్రాలు దర్శకులకు బాలీవుడ్ లో కలసి రావటంలేదు. ఇక్కడ ఎన్ని హిట్ లు ఇచ్చినా.. అక్కడి నుంచి కాల్ రావటంలేదు. అవకాశం వచ్చిన స్టోరీ చెప్పే దగ్గరే ఆగిపోతున్నారు. నిన్నటికి నిన్న రన్ రాజా రన్ తో మంచి హిట్ అందుకున్న దర్శకుడు సుజిత్.. సాహోతో తన స్థాయిని పెంచుకుని షారూక్ తో సినిమా ఓకే చేసుకున్నాడు, ఆ తర్వాత కపూర్ హీరోలతో సినిమా చేస్తున్నాడన్నారు. కట్ చేస్తే ఎవరితోను సినిమా లేకుండా పోయింది. అటు నుంచి వచ్చి తెలుగులు లూసిఫర్ చేద్దమనుకున్న అవకాశం చేయి జారిపోయింది. తర్వాత సినిమా ఎవరితో చేయాలో తెలియక ఇబ్బంది పడుతోన్న టైమ్ లో చత్రపతి హిందీ రీమక్ కు ఆల్ మోస్ట్ ఓకే అయినట్లుగా సమాచారం. ఈసారైనా ఈ సనిమా పట్టాలెక్కితే బాగుంటుంది.

అర్జున్ రెడ్డితో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా పరిస్థితి ఇదే. అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేసిన ఈ దర్శకుడు.. కబీర్ సింగ్ తో అటు బాలీవుడ్ బ్యాచ్ ను ఆకట్టుకున్నాడు. వెంటనే మరో సినిమా చేసి సెటిల్ అయిపోదాం అనుకునే లోపే హిరోలు, నిర్మాతలు మా వాళ్ల కాదని చేతులేత్తేశారు. మళ్లి టాలీవుడ్ లోనే చేద్దామని అనుకున్న అది కూడా కుదరలేదు. ఇక కథలు సిద్ధం చేసుకుని స్టార్ లకు తన కథలు వినిపంచే పనిలో పడ్డాడు. ఎదైనా ప్రాజెక్ట్ త్వరగా మొదలు పెడితే గాని సందీప్ క్రేజ్ కు ఇబ్బంది రాదు