ప్రతీరోజు అనుకొని వెనక్కి తగ్గుతున్న రాజమౌళి …?

-

ఇండస్ట్రీలో రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకి జూన్ 15 నుండి మళ్ళీ సినిమాలన్ని సెట్స్ మీదకి వెళతాయనుకున్నారు. అందుకోసమే ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రి తో చర్చలు జరిపి అనుమతులు తెచ్చుకున్నారు. ఇలా అనుమతులు రాగానే ఆర్ ఆర్ ఆర్, ఆచార్య, పుష్ప, ప్రభాస్ సినిమా, బోయపాటి బాలయ్య సినిమా… ఇలా అన్నీ తిరిగి చిత్రీకరణకు వెళతారని ఊహించారు. ఇప్పటికే ఈ సినిమాల కోసం సెట్స్ ని నిర్మించి ఉంచారు.

 

కాని ఏ ఒక్కరు తమ సినిమా ని మొదలు పెట్టేందుకు ధైర్యం చేయడం లేదని తెలుస్తుంది. రోజు రోజు కి కరోనా కేసులు అధికం అవుతుండటంతో ఒక సినిమా అంటే కనీసం 50 మంది యూనిట్ సభ్యులైనా ఉండాలి కాబట్టి ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అన్న అనుమానాలు వస్తున్నాయట. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమా దర్శకులు గాని, హీరోలు గాని సెట్స్ లో అడుగు పెట్టలేదని మాట్లాడుకుంటున్నారు.

అయితే వాస్తవంగా గత నాలుగైదు రోజులు నుంచి రాజమౌళి రెండు రోజులు ట్రయల్ షూట్ నిర్వహించాలని ప్లాన్ చేసినప్పకి ఏరోజుకు ఆ రోజు వెనకడుగు వేస్తున్నారట. ఈ ట్రయల్ షూట్ సక్సస్ అయితే మిగవాళ్ళు నెమ్మదిగా తమ సినిమాల షూటింగ్స్ ని మొదలు పెట్టుకుందామని రాజమౌళి మీద ఆధారపడి మిన్నకుండిపోయారు. కాని ఆయనే ధైర్యం చేయలేకపోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి మిగతా వాళ్ళవి భారీ బడ్జెట్ సినిమాలే. వాళ్ళు ధైర్యంగా ముందుకు రావచ్చు కదా…రాజమౌళి కోసమే ఎందుకు ఎదురు చూడాలి అంటూ రివర్స్ లో కొంతమంది కౌంటర్స్ ఇస్తున్నారట. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version