పెళ్లి రూమర్స్ పై దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ప్రముఖ నటి..!

-

ఈ మధ్యకాలంలో హీరో , హీరోయిన్ పెళ్లి చేసుకోవడం బ్రేకప్ చెప్పడం అనేవి సహజంగా మారిపోయాయి ఒకవేళ పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంటే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు అంటూ రూమర్స్ సృష్టిస్తున్నారు.. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు పెళ్లి చేసుకున్నా .. విడాకులు ఇచ్చుకున్నా .. కూడా హాట్ టాపిక్ గా మారుతున్నారు. అయితే పలు తెలుగు సినిమాలలో తల్లిపాత్రులు చేస్తూ బిజీగా ఉన్న ఒక సీనియర్ నటి ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యిందని ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది. ఆమె ఎవరో కాదు శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా నటించిన సుకన్య.

తెలుగు , తమిళ్ సినిమాలలో హీరోయిన్ గా చేసిన ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించింది. టాలీవుడ్లో మున్నా, సాంబ, శ్రీ , అమ్మ కొడుకు , పెద్దరికం, అధినాయకుడు వంటి పలు చిత్రాలలో నటించినా.. ఎక్కువగా మలయాళం సినిమాలతోనే గుర్తింపు సంపాదించుకుంది. ఇక కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2002లో శ్రీధరన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సుకన్య అమెరికాకు వెళ్ళిపోయింది. కానీ ఏమైందో తెలియదు కానీ ఏడాదిలోపే అక్కడ నుంచి విడిపోయి తిరిగి మళ్ళీ ఇండియాకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు దక్కించుకుంది

ప్రస్తుతం ఈమె వయసు 50 ఏళ్లు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఒక రూమర్ బయటకు రాగా ఇది ఆ నోట ఈ నోట పడి ఈమె వరకు చేరింది. దీంతో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. అలాంటి ఆలోచన నాకు లేదు.. అయినా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లలు అమ్మ అని పిలుస్తారా? లేక అమ్మమ్మ అని పిలుస్తారా? అంటూ కౌంటర్లు వేసింది. మొత్తానికి అయితే ఇది కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news