అల్లు అర్జున్ ఎవరో తెలియదంటున్న ప్రముఖ నటి..!

-

ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, డాన్స్ స్కిల్స్ తో మరింత పాపులారిటీని తెప్పించుకున్న ఇతడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో రష్యాలో కూడా మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో హాజరయ్యి.. అల్లు అర్జున్ అంటే ఎవరో నాకు తెలియదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఆ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రముఖ నటి, నర్తకి ఎల్. విజయలక్ష్మి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి తరానికి ఆరాధ్య దైవం. ఆమె నటించని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోలు ఆమెతో డాన్స్ చేయడం కోసం క్యూ కట్టేవారు. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయినా ఎల్ విజయలక్ష్మి దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఆలీ నిర్వహించిన ఆలీతో సరదాగా టాప్ షో కి హాజరయ్యింది. ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలను ఆమె పంచుకుంది. ఐదేళ్లకే ఆమె టీవీలో ఏనాట్యం చూస్తే ఆ నాట్యాన్ని వెంటనే ఇంటికి వచ్చి చేసే వారట. తనకు సాంగ్ వినిపిస్తే చాలు డాన్స్ ఆటోమేటిక్గా వస్తుందని చెప్పుకొచ్చింది.

ఎన్టీఆర్ తనను కోడలా అని ముద్దుగా పిలిచేవారు అని, ఆయన నటించిన గుండమ్మ కథలో తన సాంగ్ లేకుండా షూటింగ్ జరిగిందని , తనతో ఒక్క పాటైనా చేయించాలని సాంగ్ లేకుండా కేవలం మ్యూజిక్ తోనే సాంగ్ పెట్టించారని చెప్పుకొచ్చింది.పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయినా ఆమె ఈ జనరేషన్ హీరోలు నటించిన ఏ సినిమా చూశారు అని అడగ్గా.. తాజాగా పుష్ప సినిమా చూశాను అని వెల్లడించింది. అయితే ఆయన ఎవరో మీకు తెలుసా? అని ఆలీ అడగగా తెలియదు అని చెప్పింది ఎల్ విజయలక్ష్మి. అయితే ఆలీ చెబుతూ అల్లు రామలింగయ్య గారి మనవడు అని చెప్పగా ఈ మధ్యకాలంలో యంగ్ హీరోల గురించి అడుగుతుంటే అందరూ ఎన్టీఆర్ మనవడు, రామానాయుడు మనవడు అని చెబుతున్నారు అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news