గత ఏడాది సమ్మక్క సారలమ్మ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఏడాది సమ్మక్క సారలమ్మ మేడారం జాతర స్థానంలో మినీ మేడారం జాతర కొనసాగనుంది. అయితే, తెలంగాణలో మినీ మేడారం జాతరకు తాజాగా, ముహూర్తం ఫిక్స్ అయింది. సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర తేదీలను పూజారుల సంఘం తాజాగా ప్రకటించింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు మినీ మేడారం జాతర జరపనున్నట్లు పూజారులు ప్రకటించారు. అమ్మవార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సమ్మక్క సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్ద రాజుల పూజారులందరూ సమావేశమై జాతర నిర్వహణపై చర్చించారు. సమిష్టి నిర్ణయం అనంతరం జాతర తేదీలను అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 1న మండమెలిగే 2 న సారలమ్మ గద్దె శుద్ధి, 2 న సమ్మక్క గద్దె శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పూజారులు వెల్లడించారు. శుద్ధి కార్యక్రమాలు ముగిసిన తర్వాత భక్తులకు మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.