చిరంజీవి సినిమా రిలీజ్ డేట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అభిమానులు.. కారణం.?

-

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో అబౌవ్ ఆవరేజ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రిలీజ్ డేట్ పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈసారి తెలుగు థియేటర్స్ లో రెండు రాష్ట్రాలలో కూడా వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్ హీరోలైన విజయ్, వారిసు సినిమాతో పాటు అజిత్ తునివు సినిమా కూడా పోటీ పడుతున్నాయి.

అయితే జనవరి 10 , 11 తేదీలలో విజయ్, అజిత్ సినిమాలు రిలీజ్ అవుతుండగా జనవరి 12వ తేదీన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్నాయి. మరి జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల అయ్యేసరికి అప్పటికే మూడు పెద్ద సినిమాలు థియేటర్లలోకి వస్తాయి. ఆ సినిమా కలెక్షన్లు కూడా ఎక్కువగా సాధించే అవకాశం ఉంది. అంతేకాదు వాల్తేరు వీరయ్య సినిమాకు థియేటర్ ల కొరత కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు.

జనవరి 13న వాల్తేరు వీరయ్య సినిమా విడుదలయ్యే సమయానికి మూడు సినిమాలు విడుదలయి ఉంటాయి. వాటిలో రెండు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సినిమా మంచి స్క్రీన్లను పొందాలనే ఒత్తిడికి లోనవుతుంది . కాబట్టి వెంటనే మేకర్స్ సినిమా విడుదల తేదీని మార్చాలి అని లేకపోతే నష్టం వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంపై దర్శకనిర్మాతలు ఎలా జాగ్రత్త తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news