తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సినీ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లో కుటుంబసభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఓటు వేశారు. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, పెద్ద కుమార్తె సుస్మిత ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు వేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎవరి వల్ల రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే వారిని ఎన్నుకోవాలని సూచించారు. ఓటు మీ బాధ్యత, మీ హక్కు అని ఓటర్లకు పిలుపునిచ్చారు. మరోవైపు ఫిలింనగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అల్లు అర్జున్ ఓటు వేశాడు. ఇంకోవైపు కుటుంబసభ్యులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. నానక్‌రామ్‌గూడాలో ఓటు హక్కు వినియోగించుకున్న హీరో నరేష్ ప్రజలంతా తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వీరితో పాటు ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా ఓటు వేశారు.