ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరిచిపోలేనిది: చంద్రబాబు

-

ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఉండవల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ అధినేత తన కుటుంబంతో (నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి) కలిసి ఓటు వేశారు. కుటుంబంతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన చంద్రబాబు ఓటు వేసి అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరిచిపోలేనిదని అన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి అన్న చంద్రబాబు.. భవిష్యత్తును తీర్చిదిద్దేది ఎన్నికలే అని ప్రజలు గుర్తించారని తెలిపారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఏపీ ఎన్నకిలపై ప్రధాని మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఏపీ ప్రజలు, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే వారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news