fir movie : వివాదంలో “ఎఫ్ఐఆర్” సినిమా… వికారాబాద్ లో పోస్టర్లు చింపేసిన యువకులు

-

ఎఫ్ఐఆర్ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా రేపు విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమా పోస్టర్ పై మత గ్రంథాని కి చెందిన వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆందోళన చేపట్టడం ఉద్రిక్తతకు దారి తీసింది. ముస్లిం మతానికి చెందిన మత గ్రంథం లోని వ్యాఖ్యలు సినిమా పోస్టర్ పై ప్రచురించడం పై వికారాబాద్ జిల్లా తాండూరులో ఆందోళన చేపట్టారు కొంతమంది ముస్లిం యువకులు.

తాండూర్ శాంతి మహల్ థియేటర్ లో ఈ సినిమా రేపు విడుదల కానుంది. అందుకు సంబంధించిన సినిమా పోస్టర్లపై మత గ్రంథం లోని వ్యాఖ్యలు ముద్రించారని ముస్లింలు ఆందోళనకు దిగారు. రేపు విడుదల కానున్న ఈ సినిమాను అడ్డుకుంటామని ఆ ముస్లిం యువకులు హెచ్చరించారు.

ఆగ్రహానికి గురైన యువకులు థియేటర్ ముందు ఏర్పాటు చేసిన సినిమా పోస్టర్లను చించి వేశారు. సినిమా డైరెక్టర్ అలాగే థియేటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక డిఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news