సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్న జెనీలియా.. షాకిస్తున్న రెమ్యునరేషన్..!!

-

సాధారణంగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఈ సామెతను సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లు చాలా చక్కగా ఉపయోగించుకుంటారని చెప్పవచ్చు. చాలామంది వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే మంచి విజయం సాధిస్తే పారితోషకం పెంచి మరింత బిజీ ఆర్టిస్ట్ గా మారి పోతూ ఉంటారు. ఇక ఒకసారి వారి కెరీర్ డౌన్ అయిందంటే చాలు దర్శక నిర్మాతలు వారిని పట్టించుకోవడం మానేస్తారు. ఇకపోతే అవకాశాలు లేనప్పుడు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండి.. తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సెటిలై పోతూ ఉంటారు కొంతమంది నటీమణులు.

సెకండ్ ఇన్నింగ్స్ లో ఇచ్చింది తీసుకోవడమే అన్నట్టుగా కొంతమంది కెరియర్లో సాగుతూ ఉంటుంది.. మరికొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా భారీగా డిమాండ్ చేస్తూ తమ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ జెనీలియా కూడా ఒకరు. గతంలో తన అందంతో, అమాయకత్వంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ సత్యం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే దిల్ రాజు నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన బొమ్మరిల్లు సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఢీ, సాంబ, ఆరెంజ్ , సై, సుభాష్ చంద్రబోస్ వంటి సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈమె మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టినట్లు సమాచారం. మొన్నటివరకు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ నటనపై ఆసక్తి కలగడం తో మంచి కథ వస్తే ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయడానికి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కొడుకు గాలి కిరీటి నీ పరిచయం చేస్తూ.. సాయి కొర్రపాటి ఒక భారీ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. హీరో ని పరిచయం చేస్తూ టీజర్ ను కూడా విడుదల చేయగా ఇందుకోసం రాజమౌళితో పాటు జెనీలియా కూడా హాజరయ్యారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. జెనీలియా హీరోయిన్ గా ఫుల్ సింగ్ లో ఉన్నప్పుడు రూ. 70 లక్షల కంటే ఎక్కువ తీసుకోలేదు. కానీ ఈ సినిమా కోసం ఏకంగా 3 కోట్ల రూపాయలను డిమాండ్ చేసిందట. పాత్ర కూడా కొంచెం కీలకం కావడంతో నిర్మాతలు కూడా ఓకే చేసినట్లు సమాచారం. మిగతా వాళ్ళ కంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ ముద్దుగుమ్మకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version