జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చిన గెటప్ శ్రీను.. వీడియో వైరల్..!!

-

బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా కమెడియన్స్ ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారని చెప్పవచ్చు. అయితే గడిచిన గత కొద్దిరోజుల నుండి ఎక్కువగా ఈ షో నుండి కొంతమంది కమెడియన్లు సైతం ఈ షోని వదిలి వెళ్లడం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా అనసూయ కూడా ఈ షో ని వదిలి వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలాంటి సమయంలో గెటప్ శ్రీను ఒక షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

గెటప్ శ్రీను సినిమాల షూటింగ్ విషయంలో కాస్త బిజీగా ఉండడంతో జబర్దస్త్ కి కాస్త విరామం ఇవ్వడం జరిగింది. అయితే దీంతో కొంతమంది గెటప్ శ్రీను జబర్దస్త్ ను వదిలి వెళ్లాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా గెటప్ శ్రీను అధికారికంగా ప్రకటించలేదు. అంతేకాకుండా పలుసార్లు జబర్దస్త్ పై విమర్శలు వచ్చినా ఆ వార్తలపై స్పందించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపించాయి.. అందుకు తగ్గట్టుగానే ఈ రోజున కొన్ని నిమిషాల ముందు ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోని విడుదలను చేయడం జరిగింది. అందులో గెటప్ శ్రీను కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేశారు.

జబర్దస్త్ షో ద్వారా సెలబ్రిటీగా మారిన గెటప్ శ్రీను ఎన్నో సంవత్సరాలపాటు ఇందులో బాగా సందడి చేశాడు కొన్ని నెలలుగా ఈ షోలో కనిపించకపోవడంతో సుధీర్ మాదిరి గెటప్ శ్రీను కూడా ఇతర ఛానల్లోకి వెళ్లిపోతున్నారేమో అని అందరూ భావించారు కానీ.. తాజాగా గెటప్ శ్రీను జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆటో రాంప్రసాద్ తన కొత్త టీం తో కలిసి స్కిట్ చేస్తున్న సమయంలో గెటప్ శ్రీను వచ్చి సర్ప్రైజ్ ఇవ్వడం ఈ ప్రోమో లో కనిపిస్తోంది. ఇక అంతే కాకుండా గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, సీనియర్ నటి అన్నపూర్ణ అందరూ కలిసి అక్కడ పంచ్ ల ప్రవాహాన్ని కురిపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news