ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి టాలెంట్ తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుల్లో ఎస్ ఎస్ థమన్ ఒకరు. కొన్నేళ్ల క్రితం మెలోడీ బ్రహ్మ మణిశర్మ హవా మెల్లగా తగ్గుతుండగా ఇండస్ట్రీకి సంగీత దర్శకుడిగా ప్రవేశించిన థమన్, అప్పట్లో రవితేజ మరియు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన కిక్ అనే సినిమాతో మంచి పేరు సంపాదించాడు. ఇక అక్కడినుండి అతడికి మెల్లగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక తనకు వస్తున్న అవకాశాలను బాగా వినియోగించుకుని మంచి పేరుతో ముందుకు సాగుతున్న థమన్,
నేడు టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుల్లో ఒకడిగా ఎదిగాడు. అతి త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమాల్లో చాలావరకు సినిమాలు థమన్ చేతిలో ఉండడం విశేషం. ఈనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వెంకీ మామ ఆడియో గురించి నేడు మీడియాతో థమన్ ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ, మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ జర్నీగా సాగె ఈ సినిమాలో మ్యూజిక్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని, తప్పకుండా సాంగ్స్ ప్రేక్షకులకు నచ్చుతాయని తాను భావిస్తున్నట్లు థమన్ తెలిపారు.
వాస్తవానికి ఏదైనా మంచి కంటెంట్ ఉన్న స్టోరీ, లేదా ఎమోషనల్ లవ్ స్టోరీస్ కి సంగీతం ఇవ్వడం తేలికని, కానీ అదే కమర్షియల్ సినిమాకు సంగీతం అందించడం మాత్రం కొంత కష్టం అని థమన్ అన్నారు. ఎందుకంటే సినిమాలో కమర్షియాలిటీని మిస్ కాకుండా, అలానే అందులో హీరో ఇమేజ్ కి సరిపోయే విధంగా ట్యూన్స్ కట్టడం కొంత ఆలోచనతో చేయవలసిన ప్రక్రియ అని థమన్ అంటున్నారు. తాను సంగీతం అందించిన రాబోయే సినిమాల పై తనకు మంచి నమ్మకం ఉందని, అన్ని సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవని, తప్పకుండా అవి మంచి విజయాలు అందుకుని తనకు మంచి పేరు తీసుకువస్తామని ఆశిస్తున్నట్లు థమన్ తెలిపారు….!!