తెలుగు వాడు అయినా కోలీవుడ్‌లో తిరుగులేని స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు విశాల్. నడిగర్ సంఘం ఎన్నికల్లో తమిళ సీనియర్ హీరోలను సవాల్ చేసి మరీ గెలిచిన విశాల్ నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టే వరకు కూడా తాను పెళ్లి చేసుకోనని ప్రకటించాడు. ఇక విశాల్‌కు కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన అనీశాతో నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 9న వీరిద్దరి వివాహం జరుగుతుందని ముహూర్తం కూడా ప్రకటించేశారు.
ఇక కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోయారంటూ మీడియాలో వార్తలు పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. అనీషా తమ నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటోలతో పాటు విశాల్‌తో దిగిన ఫోటోలని పర్సనల్ ఎకౌంట్ నుండి డిలీట్ చేయడంతో వీళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని… వీరి పెళ్లి పీటలు ఎక్కకుండానే క్యాన్సిల్ అయ్యిందని గాసిప్ రాయుళ్లు నానా రకాలుగా ఊహించేసుకుని రాసేశారు.
అయితే ఇటీవల అనీశా ఇటీవల తనకి కాబోయే భర్త విశాల్‌కి బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తూ… నువ్వు స్టార్‌గా మెరవడానికి పుట్టావు. జీవితంలోకి మంచి రోజులు రానున్నాయి. ఆ నమ్మకం నాకుంది. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను అని అనీశా పేర్కొంది. ఆమె క్లారిటీ ఇచ్చినా చాలా మందిలో ఎక్కడో డౌట్ ఉండనే ఉంది.
తాజాగా విశాల్ తండ్రి జీకె రెడ్డి అందరికి షాక్ ఇస్తూ అదిరిపోయే క్లారిటీ ఇచ్చారు. విశాల్, అనీశారెడ్డిల వివాహం నిర్ణయించిన ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే వివాహ తేదీని ఇంకా నిర్ణయించలేదని అన్నారు.దీంతో విశాల్ పెళ్ళిపై అభిమానులకి పూర్తి క్లారిటీ వచ్చేసింది.