డీప్‌ ఫేక్‌ బారిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా

-

ప్రస్తుతం ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తున్న అంశం డీప్ ఫేక్. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు దీని బారిన పడ్డ విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా కూడా డీప్ ఫేక్ బాధితురాలైంది. పీసీకి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతోంది. ప్రియాంకా గతంలో మాట్లాడిన వీడియోను డీప్ ఫేక్ చేసి ఓ నకిలీ బ్రాండ్​ను ప్రమోట్ చేస్తున్నట్లు ఆమె ముఖంతో లిప్ సింగ్ చేశారు.

- Advertisement -

ఇంకా ఈ వీడియోలో.. ఒక బ్రాండ్‌ కారణంగా 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని.. అందరూ దాన్ని ఉపయోగించాలని ప్రియాంక చెప్పినట్లు క్రియేట్‌ చేశారు. దీనిపై పలువురు స్పందిస్తూ వీడియో క్రియేటర్స్​పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇలా చేయడం దారుణమంటూ ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు దీనిపై ఇంకా ప్రియాంకా చోప్రా స్పందించలేదు.

ఇక ఇటీవల రష్మిక మందన్న, అలియా భట్‌, కాజోల్‌, కత్రినా కైఫ్‌ల డీప్ ఫేక్‌ వీడియోలు ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. వీటిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డీప్‌ ఫేక్‌ వీడియోలకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...