తెలంగాణ సీఎం రేవంత్ కు అభినందనలు – రాహుల్ గాంధీ

-

తెలంగాణ సీఎం రేవంత్ కు అభినందనలు అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్ గాంధీ. ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన టిపిసిసి అధ్యక్షులు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ కు అభినందనలు… రేవంత్ నాయకత్వం లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు జరుగుతాయని చెప్పారు. ప్రజా సర్కార్ ను కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుందన్నారు.

కాగా, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముహూర్తంలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రేపు మ. 1. 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాస్తవానికి రేపు ఉదయం 10 గంటల సమయంలో ప్రమాణస్వీకారం చేయాలి. కానీ రేపు మ. 1. 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు రేవంత్‌ రెడ్డి. ఇక ఆ కార్యక్రమానికి హాజరుకావాలని ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు.

Read more RELATED
Recommended to you

Latest news