పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..పవర్ స్టార్‌తో కలిసి కనిపిస్తానంటున్న ఆలీ..

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్..కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలసిందే. పవన్ సినిమాల్లో ఆలీ-పవన్ కాంబో సీన్స్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని చెప్పొచ్చు. వీరిరువురి నడుమ సీన్స్ , కామెడీ ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తాయి. అయితే, పవన్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం నుంచి వీరిరువురి కలిసి నటించడం లేదు.

కారణాలేవైనా కానీ పవన్ కల్యాణ్-ఆలీ వెండితెరమీద కనిపించలేదు. కాగా, త్వరలో మళ్లీ కలిసి కనిపిస్తామని స్వయంగా ఆలీయే చెప్పారు. ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రామ్ లో ఆలీ ఈ వ్యాఖ్యలు చేయగా, పవన్ అశేష అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను ఎంటర్ టైన్ చేయడానికి మళ్లీ కలిసి ముందుకు రావడం సూపర్ అని అంటున్నారు.

ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ఇటీవల ‘సమ్మతమే’ ఫిల్మ్ హీరో, హీరోయిన్స్ కిరణ్ అబ్బవరం, చాందినీ వచ్చారు. ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం..పవన్ కల్యాణ్-ఆలీ కాంబో సీన్స్ గురించి అడిగారు.

‘జల్సా’, ‘ఖుషీ’ టైమ్ లో సీన్స్ ఎలా ఇంప్రువజైషేన్ చేశారని సరదాగా ప్రశ్నించారు. సెట్స్ లో తాను పవన్ డిస్కస్ చేసుకుని అలా హ్యాపీగా సీన్లు వచ్చేలా చేశామని చెప్పిన ఆలీ..త్వరలో కలిసి కనిపిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, పవన్ -ఆలీ స్క్రీన్ షేరింగ్ కాంబో కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news