మెగా ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్…!

-

మెగాస్టార్ చిరంజీవి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వీరి కాంబినేషన్లో సినిమా అనగానే హిట్ అనే భావన అభిమానుల్లో ఉంటుంది. వీరిద్దరూ కలిసి దాదాపు 14 సినిమాల వరకు చేశారు. రెండు సినిమాల్లో చిరంజీవి హీరో గా ఉన్నారు మిగిలిన సినిమాల్లో దాదాపు 10 సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది.

శ్రీదేవి చిరంజీవి నటించిన సినిమా బంపర్ హిట్ అయింది. అదలా ఉంటే ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిసి పని చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే మలయాళం రీమేక్ సినిమా లూసిఫర్ ని చేయనున్నారు. ఆ సినిమా తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఈ సినిమాకు సంబంధించి ఇటీవల వీరి మధ్య చర్చలు కూడా జరిగాయని నిర్మాతగా రామ్ చరణ్ ఉంటారని అంటున్నారు. లూసీఫర్ రీమేక్ షూటింగ్ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ లో కూడా చిరంజీవి పాల్గొనే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు రాఘవేంద్రరావు చిరంజీవి హిట్ కాంబినేషన్ లో సినిమా అనగానే టాలీవుడ్ జనం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news