మెగా ఫాన్స్ కి గుడ్ న్యూస్…!

-

టాలీవుడ్ లో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఫ్యామిలీ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఫ్యామిలీ లో చిరంజీవి నుంచి నిహాకరిక వరకు అదే క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అందరూ కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటీ అంటే…

రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కలిసి ఒక సినిమా చేస్తున్నారట. ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో వచ్చే సినిమా అని సమాచారం. క్రిష్ తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కరోనా కారణంగా ఈ ఏడాది సినిమా షూటింగ్ లేదు. రామ్ చరణ్ ఈ సినిమాలో పాత తరం పోలీస్ అధికారిగా నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

కథలో తన పాత్ర నచ్చడం తో రామ్ చరణ్ ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. రాబోయే సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే రామ్ చరణ్ ఈ సినిమా మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. తన పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండటం తో ఈ సినిమాను వదులుకోవద్దు అని భావిస్తున్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా తనకు దగ్గరయ్యే అవకాశం ఉందని రామ్ చరణ్ భావిస్తున్నాడు

Read more RELATED
Recommended to you

Latest news