సామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత అభిమానులకు గుడ్ న్యూస్. స‌మంత హాలీవుడ్ లో కి ఎంట్రీ ఇస్తుంది. తాజా గా త‌న ఇంటర్నేష‌నల్ ప్రాజెక్ట్ పై సామ్ సంత‌రకం చేసింది. దీంతో సామ్ హాల్ వుడ్ ఎంట్రీ క‌న్ఫామ్ అయింది. కాగ అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ప్ర‌ముఖ న‌వలిస్ట్ టైమెరి ఎన్‌. మురారి ర‌చించిన అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్ అనే న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌బోతుంది.

ఈ న‌వ‌ల బెస్ట్ సెల్లింగ్ న‌వ‌ల గా ఉంది. అలాగే ఈ సినిమా కు డైరెక్ట‌ర్ గా ఫిలిప్ జాన్ వ‌హించ‌నున్నారు. అలాగే క‌థ ను కూడా ఫిలిప్ జాన్ సిద్ధం చేయ‌నున్నాడు. స‌హ రచ‌యిత గా నిమ్మి హ‌ర‌స్గామ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అలాగే ఈ అరేంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ అనే సినిమా సునీత తాటి నిర్మించ నున్నారు. కాగ సమంత హాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంద‌ని.. ఒక అంత‌ర్జాతీయ డైరెక్ట‌ర్ ను కూడా క‌లిసింద‌ని వార్తలు వ‌చ్చాయి. ఇప్ప‌డు ఆ వార్తలు నిజం చేస్తు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.