అఫీషియల్: సూపర్ స్టార్ అభిమానులకు మరో శుభవార్త..ఆ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన అభిమానులకు మరో శుభవార్త చెప్పాడు. ఈ నెల 12న ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల కానుంది. కాగా, ఈ క్రమంలోనే మహేశ్ బాబు తన నెక్స్ట్ ఫిల్మ్ అప్ డేట్ ఇచ్చేశాడు.

- Advertisement -

ట్విట్టర్ వేదికగా అభిమానుల కోసం స్పెషల్ లెటర్ రిలీజ్ చేశారు ప్రిన్స్ మహేశ్. ఈ ఏడాది జూన్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకుని అభిమానులు, సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు 2005 లో ‘‘అతడు’’, 2010లో ‘‘ఖలేజా’’ సినిమాలు చేశాడు. ఇప్పుడు #SSMB28 మూవీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా మహేశ్ అభిమానులు ఎస్ ఎస్ ఎంబీ హ్యాష్ ట్యాగ్ తో #SSMB28 వరుస ట్వీట్స్ చేస్తున్నారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వి్ట్టర్ లో త్రివిక్రమ్-మహేశ్ ఫొటోలను ట్వీట్ చేస్తున్నారు.

ఈ సారి తెరకెక్కబోయే ఈ పిక్చర్ ‘‘అతడు, ఖలేజా’’లను మించి ఉండాలని కోరుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ ఫిల్మ్..డెఫినెట్ గా అభిమానుల అంచనాలను మించి ఉంటుందని సూపర్ స్టార్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫిల్మ్ లో మహేశ్ కు జోడీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆస్థాన హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.

 


s=20&t=txpyWu6CkA2Ty3iSLB-Idg

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...