హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలి…. రాహుల్ గాంధీకి అసదుద్దీన్ ఓవైసీ సవాల్

-

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన పొలిటికల్ హీట్ పెంచింది. వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ తన ఎన్నికల హామీలను ప్రజల ముందుంచింది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ టూర్ పై ఇటు అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ పార్టీల మధ్య ట్విట్ వార్ కొనసాగుతోంది. తెలంగాణలో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన ఒక్కసారిగా ఎన్నికల వాతావరణాన్ని తీసుకువచ్చాయి.

Asaduddin
Asaduddin

ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. వచ్చి హైదరాబాద్ లేదా మెదక్ నుంచి పోటీ చేయడం… మీ అదృష్టాన్ని పరీక్షించుకోండంటూ సవాల్ విసిరారు. ఈసారి మీరు వయనాడ్ నుంచి కూడా ఓడిపోతావని రాహుల్ గాంధీని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, నన్ను కూడా సవాల్ చేసేందుకే రాహుల్ గాంధీ వచ్చారని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news