బాలయ్య ఫాన్య్ కి అదిరిపోయే న్యూస్… మరో మాస్ ఎంటర్ టైనర్ పక్కా

-

అఖండ విజయంతో మంచి ఊపుమీదున్న బాలకృష్ణ యువదర్శకుడు గోపిచంద్ మలినేనితో తన 107వ సినిమాకి సిద్దమయ్యారు. బోయపాటి దర్శకత్వంలో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలకృష్ణ మరో మాస్ ఎంటర్ టైనర్ కు పచ్చజెండా ఊపారు.బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో మన అందరికీ తెలుసు. బాక్సాఫీస్ లో కలెక్షన్ల సునామిని చూసిన ప్రతి సినిమా ప్రేమికుడు థియేటర్లలో జై బాలయ్య అని అరిచిన అరుపులు ఇంకా మన చెవుల్లో మారుమోగుతునే ఉన్నాయి. మాస్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన బాలయ్య అదే జోనర్ కు చెందిన దర్శకుడు గోపిచంద్ మలినేనితో జతకట్టడం సినిమాపై అంచనాలను పెంచింది.

- Advertisement -

2010లో డాన్ శీనుతో దర్శకుడిగా మారిన గోపిచంద్… అంతకు ముందు ఈటీవీలో చిన్నచిన్న షోలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేశారు. గోపిచంద్ రవితేజతో తెరకెక్కించిన డాన్ శీను అప్పటి కుర్రకారుతో విజిల్స్ కొట్టించింది. రవితేజ లక్కీఛాంప్ గా మారిన గోపిచంద్ బాలయ్యతో సై అనేందుకు సిద్ధమైన వేళ టాలీవుడ్ వర్గాలు షేర్ మార్కెట్ లాగా సినిమా బడ్జెట్ పై లెక్కలు వేస్తున్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీస్ నిర్మిస్తుండగా ఇప్పటికే చిత్ర ప్రధానతారగణం ఎంపిక కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.

బాలయ్య పవర్ ని ఎదుర్కోవాలంటే ప్రతినాయకుడు కూడా ఆ రేంజ్ ఉండాలి మరి. అందుకే దర్శకుడు గోపిచంద్ కన్నడ స్టార్ ‘దునియా విజయ్’ ను విలన్ గా తీసుకున్నారు. హిరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసినట్లు గోపి చెప్పారు. శరత్ కుమార్, రాధికల కూతురైన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటించనున్నారు. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని తమన్ అందిచనున్నారు. అఖండతో బాలయ్యకి మంచి సన్నిహితుడైన తమన్ ఈ చిత్రానికి ఆ తరహాలోనే మ్యూజిక్ చేయడం ఖాయమనేది చెప్పనక్కర్లేదు.


బాలయ్య నట విశ్వరూపాన్ని చూడాలంటే మాస్ సినిమాల్లోనే సాధ్యం. మాస్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేయడంలోగోపిచంద్ వేరే లెవెలనే చెప్పాలి. వీరి ఇద్దరి కాంబినేషన్ అటు బాలయ్య ఫ్యాన్స్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ అంచనాలను పెంచుతుంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ అనే టాక్ షోకి డిసెంబర్ 7న గెస్ట్ గా విచ్చేసిన గోపిచంద్ వీరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలోని ఒక చిన్న సన్నివేశాన్ని రీవిల్ చేశారు. ఆ సీన్ కు అక్కడి ప్రేక్షకులు వేసిన విజిల్స్ చూస్తే మనకి అర్థమవుతుంది వీరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందనేది. ఇప్పటికే పూజ కార్యక్రమం జరుపుకున్న బాలకృష్ణ 107వ సినిమా మొదటి షెడ్యూల్ జనవరి 20న ప్రారంభంకానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే మలినేని గోపిచంద్, బాలయ్యల కాంబినేషన్ మాస్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...