ఆ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి..జగన్‌ కు ఆర్జీవీ వార్నింగ్ !

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ పెద్దలపై నెల్లూరు జిల్లా కోవూరు అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు అని…. అసలు వాళ్ళకి ఏపీ ఉందని అసలు గుర్తుందా అని నిలదీశారు. పెద్ద సినిమాల టికెట్లను 1000 నుంచి 2000 అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి.

అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలకు టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. చిత్ర పరిశ్రమపై కామెంట్లు చేయడానికి ఆయన ఎవరు.. ఇలాంటి నేతలను సీఎం జగన్‌ కంట్రోల్‌ చేయాలని కోరారు వర్మ. లేకపోతే.. సీఎం జగన్‌ కు కష్టకాలం తప్పదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కంటే ఎక్కువ ఆదరణ జగన్‌ కు ఉందని.. దానిని ఆయన కాపాడుకోవాలని సూచనలు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి.. లాంటి వాళ్లను కంట్రోల్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news