‘గుంటూరు కారం’ మూవీ నుంచి శ్రీలీల ఫస్ట్ లుక్ రిలీజ్

-

టాలీవుడ్​లో హాపెనింగ్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున వినిపించే పేరు శ్రీలీల. ఈ బ్యూటీ పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్​లో అడుగుపెట్టింది. ఆ సినిమా సక్సెస్ కాకపోయినా అరడజనుకుపైగా అవకాశాలను లాగేసుకుంది. ఇక ప్రస్తుతం డజనుకుపైగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపేస్తోంది.

ఈ బ్యూటీ తాజాగా మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది. ఇవాళ శ్రీలీల బర్త్ డే సందర్భంగా.. ఈ చిత్రబృందం ఈ మూవీలో శ్రీలీల లుక్​ను రిలీజ్ చేసింది. శ్రీలీల ఫస్ట్​లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లంగావోణీలో అచ్చమైన పల్లెటూరు ఆడపడుచులా శ్రీలీల చాలా అందంగా కనిపిస్తోంది.

ఈ సినిమాలో శ్రీలీలకు మంచి స్కోప్ ఉన్న పాత్ర పడినట్లు ఇన్ సైడ్ టాక్. అంతేకాకుండా త్రివిక్రమ్.. మహేెశ్-శ్రీలీల మధ్య మాస్ బీట్ ను ప్లాన్ చేస్తున్నాడట. ఇక ప్రస్తుతం శ్రీలీల.. నవీన్‌ పొలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’, బోయపాటి-రామ్‌ పోతినేని మూవీ, బాలయ్య భగవంత్ కేసరి సినిమాలతో పాటు గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కీరిటీ డెబ్యూ మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news