ఇలా చేస్తే చాలు.. గులాబీ మొక్క‌ల‌కు పువ్వులు గుత్తులుగా పూస్తాయి..!

-

మీ ఇంట్లో కూడా అందమైన మొక్కలు ఉన్నాయా..? అయితే గులాబీ మొక్కలని పెంచే వాళ్ళు ఈ చిట్కా ని చూడండి ఇలా కనుక మీరు చేశారంటే గులాబీ పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అందులో సందేహం లేదు. మొక్కలు పువ్వులు ఇంట్లో ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ముఖ్యంగా గులాబీ పూలు చాలా అందంగా కనపడతాయి మన మనసును ప్రశాంతంగా మారుస్తాయి.

గులాబీ మొక్కలు ని జాగ్రత్తగా పెంచుకుంటే మంచిగా పూలు పూస్తాయి చూడడానికి చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా గులాబీ మొక్కలు ఉన్నట్లయితే ఇలా చేయండి. అప్పుడు గుత్తుల గుత్తులుగా పూలు పూస్తాయి. గులాబీ మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే బియ్యం కడిగిన నీళ్లను తీసి ఒక రోజంతా కూడా దాన్ని నిల్వ ఉంచి ఆ నీళ్ల లో బాగా మగ్గిన అరటి పండ్లు తొక్కలని వేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి మెత్తని జ్యూస్ లాగ చేసుకోండి.

దీన్ని మూత పెట్టి రెండు రోజులు పాటు ఉంచండి. మంచి సేంద్రియ ఎరువు లాగ ఇది మారుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గులాబీ మొక్కల కి కొంచెం కొంచెం స్ప్రే చేయండి. ఇలా చేయడం వలన గులాబీ పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి బాగా ఎక్కువ మోతాదులో వేయకండి కొంచెం కొంచెం మాత్రమే స్ప్రే చేయండి. ఇలా ఈ చిన్న చిట్కాతో మంచిగా మొక్కలని పెంచుకోవచ్చు చక్కగా గులాబీ పూలు ఎక్కువగా పూస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news