నిమ్స్‌లో కొత్త బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

-

తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రం వైద్య రంగంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించే దిశగా రాష్ట్ర సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నలుమూలల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపడుతోంది. ఇక తాజాగా దేశంలోనే అతి పెద్ద ఆస్పత్రిగా నిమ్స్ ఆస్పత్రిని తీర్చిదిద్దుతోంది.

పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం  అందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ సర్కారు నిమ్స్ ఆస్పత్రి అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఇప్పటికే దాదాపు 30కి పైగా విభాగాలతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న నిమ్స్.. అదనంగా మరో 2వేల పడకల నూతన బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్  నూతన బ్లాక్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

అనంతరం గర్బిణులు, బాలింత కోసం ఉద్దేశించిన కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పంపిణీని సీఎం ప్రారంభించారు. కేసీఆర్ వెంట రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కూడా ఉన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో మరో ముందడుగు పడిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా హబ్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ దార్శనికతతో హెల్త్‌హబ్‌గా కూడా తయారవుతోందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news