అమెరికాలో ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్

-

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తరచూ ఓ అప్డేట్ వదులుతూ ప్రేక్షకులకు సినిమాపై హైప్ పెంచుతోంది. ఇక త్వరలోనే ట్రైలర్ రిలీజ్కు సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో మహేశ్ బాబు నయా ట్రెండ్ షురూ చేసే యోచనలో ఉన్నాడట. టాలీవుడ్ చరిత్రలో తొలిసారిగా ఈ ట్రెండ్కు శ్రీకారం చుట్టనున్నాడట. ఇంతకీ ఆ ట్రెండ్ ఏంటంటే..?

జనవరి 6వ తేదీన హైదరాబాద్లో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందట. ఆ రోజే ట్రైలర్ను కూడా రిలీజ్ చేయనున్నారట. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను అమెరికా థియేటర్స్లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నారట. కాలిఫోర్నియాలోని సినీ లాంజ్‌ ఫ్రీమాంట్‌ 7 సినిమాస్‌ స్క్రీన్‌పై ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version