Guntur kaaram : గుంటూరు కారం సెకండ్ డే కలెక్షన్స్..

-

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 127 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘ఈ భోగికి మీలో ఉన్న Egos & Hatred కాల్చేస్తారు అని ఆశిస్తూ, మీ అందరికీ భోగి శుభాకాంక్షలు’ అని Xలో పోస్ట్ చేసింది.

GunturKaaram grosses over 𝟏𝟐𝟕 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 in 2 Days Worldwide

కాగా తొలిరోజు రూ. 94 కోట్ల గ్రాస్ సాధించి మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ డేగా ఈ సినిమా నిలిచిందని మేకర్స్ ప్రకటించారు. కాగా, టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. గుంటూరు కారం సినిమా మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల మరియు సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించారు. అయితే సంక్రాంతి కానుకగా శుక్రవారం రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news