Guntur Kaaram Trailer : గుంటూరు కారం ట్రైలర్‌ కు ముహుర్తం ఫిక్స్‌

-

Guntur Kaaram Trailer : గుంటూరు కారం ట్రైలర్‌ కు ముహుర్తం ఫిక్స్‌ అయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో ఈ నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైనటువంటి పాటలకు మంచి స్పందన లభిస్తుంది. అయితే తాజాగా గుంటూరు కారం ట్రైలర్‌ కు ముహుర్తం ఫిక్స్‌ అయింది.

ఇవాళ గుంటూరు కారం ట్రైలర్‌ రిలీజ్‌ కానుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. ఇది ఇలా ఉండగా, ఈ చిత్రం తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది.ఈ చిత్రాన్ని అమెరికాలో భారీ ఎత్తున సుమారు 5000లకు పైగా ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో అత్యధిక ప్రీమియర్ షోలు ప్రదర్శితం అయిన సినిమాగా RRR (5408 షోలు)రికార్డును గుంటూరు కారం సినిమా బ్రేక్ చేయనుంది.అయితే ఈ రికార్డును ఈ చిత్రం 5408 షోల‌తో బ‌ద్ద‌లుకొట్ట‌బోతుంది అని అంటూ చిత్ర‌యూనిట్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news