లోకల్‌ వాదాన్నే నమ్ముకున్న బీఆర్‌ఎస్‌

-

పదేళ్ళ అధికారం తరువాత ప్రతిపక్ష స్థానంలో కూర్చుంది భారత రాష్ట్ర సమితి.ఎంతలా అంటే తామంతా లోకల్‌ అని జనాలు అంగీకరించేలా పార్టీలో కసరత్తులు మొదలుపెట్టారు ఆ పార్టీలోని నేతలు. పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్ళీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడంపై కనీస ఆలోచన చేయకపోగా తెలంగాణ వాదమే వినిపిస్తామని తెలంగాణ ప్రజలకు భరోసా ఇస్తున్నారు.దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి టీఆర్ఎస్‌ను భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నామని చెప్పిన కేసీఆర్‌ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారు.ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా గతంలో ఎంతో దృష్టి పెట్టిన మహారాష్ట్ర వైపు అసలు చూడటం లేదు. ఏపీలో అయినా పోటీ చేస్తారనుకుంటే అలాంటి ఆలోచన చేయడం లేదంటున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ను పేరుకే జాతీయ పార్టీగా ఉంచేసి..కనీసం ఉనికి కాపాడుకుందామన్న ప్రయత్నాల్లో బీఆర్ఎస్ పెద్దలు లోకల్‌గా టీఆర్‌ఎస్‌ పేరును ప్రజల ముందుకు తీసుకొచ్చే పనిలో పడ్డారు.

brs party
brs party

ఇటీవల జరిగిన పలు మీటింగుల్లో మాజీమంత్రి కేటీఆర్….బీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీ కాదని తెలంగాణ పార్టీనే అన్నట్లుగా చెప్తున్నారు.జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు దేశంలోని ఇతర రాష్ర్టాలమాదిరిగానే తెలంగాణను కూడా ఒక రాష్ట్రంగా చూస్తాయని, అదే బీఆరెస్‌కు తెలంగాణే కేంద్రమంటూ మాట్లాడుతున్నారు. తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్‌, బీఆరెస్ ప్రతీక అని చెప్పుకొస్తున్నారు.ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని ఉన్నా తమ ప్రధాన కేంద్రం తెలంగాణ అంటూ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.పార్టీ ఎజెండా తెలంగాణ అంటూనే జాతీయ పార్టీల ఎంపీలకు తెలంగాణ పట్ల ప్రత్యేక గౌరవం, ప్రేమ ఉండవని చెప్తున్నారు.బీఆర్‌ఎస్‌ గళం, బలం తెలంగాణ మాత్రమేనంటున్నారు. తమది జాతీయ పార్టీయేనని ఓ వైపు చెప్తున్నా ఎంపికైనవారు జాతీయ పార్టీ ఎంపీలు అనే సంగతిని మరిచిపోవడం మరో విడ్డూరకర అంశం అని జనాలు చర్చించుకుంటున్నారు.అందితే ఢిల్లీ నినాదం.. అందకపోతే తెలంగాణ సెంటిమెంట్‌ అన్నట్లుగా బీఆరెస్‌ నేతల వైఖరి తయారైందని అంటున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రాంతీయ పార్టీయేనంటూ స్వయంగా బీఆరెఎస్‌ అగ్రనేతలే యూటర్న్‌ తీసుకుంటున్నారా? అనే అనుమానాలను కలిగిస్తున్నారా అనే చర్చలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్నాయి.

లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర-రాష్ట్రాల్లోని అధికార జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లను కాదని ప్రజలు బీఆరెస్‌కు ఓటేయడం కష్టమనే అనిపిస్తోంది.అందుకే సెల్ప్‌ రిపేర్‌ స్టార్ట్‌ చేశారు ఆ పార్టీ నేతలు.ఇప్పుడుండే లోక్‌సభ స్థానాలు తగ్గిపోకుండా వాటిని నిలబెట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలో కూడా కొన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే మాటేమోగానీ, పొరుగున ఉన్న ఏపీ సంగతి కూడా పక్కన పెట్టేశారు. ఏపీలో ఆ పార్టీలో ఉన్న అరకొర నేతలు ఇతర పార్టీల వైపు చూస్తుండటంతో ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణలో ఎదురీదుతున్న బీఆరెస్ తిరిగి తెలంగాణ వాదాన్ని తలెకెత్తుకుంది. ఈ నేపథ్యంలో పక్క రాష్ర్టాల వైపు చూసే తీరిక లేదని బీఆర్‌ఎస్‌ కేడర్‌ అంటోంది. దీనిని బట్టి చూస్తే జాతీయ రాజకీయాల విషయంలో బిఆర్‌ఎస్‌ విఫలమైనట్టేనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news