విడాకులు తీసుకున్న మరో సెలబ్రిటీ కపుల్

-

మరో సెలబ్రిటీ జంట విడాకుల బాట పట్టింది. తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌, ఆయన భార్య, గాయని సైంధవి 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వారు పోస్టు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ మేనల్లుడు అయిన జీవీ ప్రకాశ్‌.. 2013లో తన బాల్య మిత్రురాలు సైంధవీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2013లో వారికి కూతురు పుట్టింది.

‘‘చాలా ఆలోచించిన తర్వాత ‘సైంధవి, నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరం’’ అని జీవీ ప్రకాశ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news