వరల్డ్ ఫస్ట్ సింగిల్ షాట్ మూవీ ట్రైలర్ రిలీజ్.. అద్దిరిపోయిందంతే?

-

యాపిల్ బ్యూటీ హన్సిక వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. వెరైటీ కథలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఓవైపు వెండితెరపై మరోవైపు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఇక లేటెస్ట్గా ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘105 మినిట్స్‌’. రాజు దుస్స దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.

అయితే ఈ సినిమాలో కేవలం హన్సిక మాత్రమే ఉంటుందట. అంటే ఒక్క పాత్రతోనే సినిమా అంతా నడిపిస్తారన్నమాట. అంతే కాదండోయ్ సింగిల్ షాట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. హన్సిక నటించిన ఈ చిత్రం వరల్డ్ ఫస్ట్ సింగిల్ క్యారెక్టర్, సింగిల్ షాట్ మూవీ అన్నమాట. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో ఓసారి చూసేద్దామా?

ట్రైలర్ ప్రారంభంలో హన్సిక ఓ పెద్ద బంగ్లాలో ఉండటం కనిపిస్తోంది. ఆ తర్వాత ఇంట్లో, అడవిలో ఒంటరిగా తిరుగుతున్న ఆమెను ఏదో ఒక అదృశ్య శక్తి భయ పెట్టడంతో పాటు చంపేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ సమస్య నుంచి బయటపడలేక తనను తానే గొంతుకు చైన్ చుట్టుకుని మరీ చనిపోయేందుకు ప్రయత్నిస్తుంది. మరి ఇంతకీ ఆమెను వెంటాడే శక్తి ఏంటి? దాని నుంచి ఆమె ఎలా బయటపడింది? తెలియాలంటే జనవరి 26న థియేటర్లకు వెళ్లాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news