పెళ్లికి సిద్ధమైన హన్సిక.. వరుడు ఎవరంటే..!!

-

సాధారణంగా హీరోలు.. పెళ్లిళ్లకు తొందర పడుతుంటే హీరోయిన్లు మాత్రం పెళ్లిళ్లు అనే పదానికి దూరంగా ఉంటున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరుగా తాము కూడా పెళ్లికి రెడీ అవుతున్నామంటూ ముందుకు వస్తున్నారు. ఇక ఇదివరకే ఆలియా, కత్రినా కూడా వివాహం చేసుకున్నారు. అలాగే నటుడైన జాకీ భగ్నానితో రకుల్ వివాహం జరగబోతోంది. మరొక గోవా బ్యూటీ ఇలియానా కూడా తొందర్లోనే కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ ను వివాహం చేసుకోబోతోంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హన్సిక కూడా పెళ్లి చేసుకోబోతోంది అంటూ కొత్త కబురు అందింది.

హన్సిక పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది అని , డిసెంబర్లో జైపూర్ కోటలో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని, అంతేకాదు ఇప్పటికే పెళ్లికి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి అని.. ప్రముఖ మీడియాలో కథనాలు వెలువడడంతో ఈ విషయం కాస్త వైరల్ అవుతోంది.. ఇక టీవీ సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన హన్సిక తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలలో హీరోయిన్ గా నటించింది. అంతేకాదు పలువురు హీరోలతో ప్రేమాయణాలు కూడా సాగించిందని వార్తలు విపరీతంగా వినిపించాయి. ఇక అంతకుముందే తమిళ్ హీరో శింబు తో కూడా ప్రేమాయణం జరిపి బ్రేకప్ చెప్పేసింది.

ఎట్టకేలకు ఈమె వ్యక్తిగత జీవితంలో కొత్త అంకం మొదలుకానుంది. తన మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోబోతోందట. వీరు పెళ్లి కోసం 450 ఏళ్ల నాటి కోట జైపూర్ ప్యాలెస్ వేదిక కావడం తో హన్సిక వివాహం వేడుక పాతకాలపు ట్రెడిషనల్ టచ్ లో రాయల్ గా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. జైపూర్ లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ అందుకు వేదిక అయింది . విలాసవంతమైన డెస్టినేషన్ వెడ్డింగ్ తనకు తన కాబోయే భర్తకు జీవితకాల జ్ఞాపకాలను అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మొత్తానికైతే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుందని తెలిసి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news