హనుమాన్ నుంచి ‘శ్రీరామ దూత’ సాంగ్.. గూస్ బంప్స్ గ్యారెంటీ

-

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబోలో వస్తున్న సినిమా హనుమాన్. జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్, అందులోని బీజీఎం, విజువల్స్ ప్రేక్షకులకు సినిమాపై హైప్ను అమాంతం పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర బృందం మరో అప్డేట్ ఇచ్చింది.

ఈ సినిమా నుంచి తాజాగా శ్రీరామ దూత స్తోత్రం లిరికల్ సాంగ్ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. “రం రం రం రక్త వర్ణం.. దినకర వదనం.. తీక్షద్రష్టం కరాళం.. రం రం రం రమ్యతేజం” అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. క్షణాల్లోనే ఈ పాట నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ వింటే గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి మీరూ ఓ సారి ఈ పాటను వినేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version