మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ గైర్హాజరు

-

దిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ హాజరు కావాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే విచారణకు హాజరుకావడం లేదని కేజ్రీవాల్‌ ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు తాను హాజరు కాబోనంటూ లేఖ రాశారు.

మరోవైపు ఆ నోటీసులు అక్రమమని, కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే ఉద్దేశంతోనే వాటిని ఇచ్చారని ఆప్‌ ఆరోపించింది. కేజ్రీవాల్‌కు ఇప్పటివరకు మూడుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చిందని సహకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నోటీసులు ఎందుకు పంపారని ప్రశ్నించింది. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా కేజ్రీవాల్ను అడ్డుకోవాలని కేంద్ర సర్కార్ చూస్తోందని ఆప్ నేతలు ఆరోపించారు. ఆయణ్ను అరెస్టు చేసే ఉద్దేశం కనిపిస్తోందని అన్నారు. మరోవైపు ఇదే కేసులో ఇప్పటికే సీబీఐ కేజ్రీవాల్‌ను విచారించిన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో ఆయణ్ను 9 గంటల పాటు ప్రశ్నించించింది. అనంతరం ఈడీ నుంచి సమన్లు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version