హ్యాపీ బర్త్ డే స్టైలిష్ (ఐకాన్) స్టార్..!

చిరంజీవి అల్లుడు.. టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు వారసుడు.. అయినా సరే సినిమాని సినిమాగా ప్రేమించబట్టే ఇప్పుడు స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. గంగోత్రి సినిమా నుండి రాబోతున్న పుష్ప వరకు తనని తాను మలచుకున్న తీరు అద్భుతం. ఓ టాప్ ప్రొడ్యూసర్ కొడుకుగా తను అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాని తన మీద ఆశలు పెట్టుకున్న అభిమానుల అంచనాలను తగ్గించడం తన వల్ల కాదు అందుకే సినిమా సినిమాకు రెట్టింపు ఉత్సాహం.. కష్టం పడుతూ స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు.

Happy Birthday Stylish Star Icon Star Allu Arjun

ఇన్నాళ్లు కేవలం తెలుగు, మళయాళ ఆడియెన్స్ కే దగ్గరైన అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ వైడ్ సత్తా చాటాలని చూస్తున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా మారాడు. సినిమా కోసం బన్నీ పడిన కష్టం ఏంటి అన్నది ఈరోజు తన కెరియర్ గ్రాఫ్ చూస్తే అర్ధమవుతుంది. ప్రతి అల్లు అర్జున్ అభిమాని వు లైవ్ స్టైలిష్ స్టార్ అనుకునేలా ప్రతి సినిమా వారు గర్వపడేలా చేస్తున్నాడు.. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్టైలిష్ స్టార్ అదే మన ఐకాన్ స్టార్ కు మనలోకం.కామ్ టీం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.