Custody : సమంతాను కాదని..కృతి సనన్ కస్టడీలో చైతూ

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగచైతన్యను ఓ కొత్త లుక్ లో చూపెడుతోంది కస్టడీ మూవీ. చైతూ ఓ కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా టీజర్ మార్చి 16 రిలీజైంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఈ సినిమాను రెండు భాషల్లో తీసుకువస్తున్నారు. అయితే శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా, పోస్టర్స్ రిలీజ్ దగ్గర నుంచే అందరిలో ఆసక్తిని పెంచడం మొదలైంది.

మే 12 వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ప్రధానమైన పాత్రలపై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేపుతోంది.చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. ‘బంగార్రాజు’ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. ఇళయరాజా .. ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించడం విశేషం. అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. సంపత్ రాజ్ .. ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అయితే.. ఉగాది పర్వదినం సందర్భంగా.. కృతి సనన్‌…చైతూ రొమాంటిక్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news