వాణీ విశ్వనాథ్ వారసురాలు ఎంత అందంగా ఉందో చూశారా.. హీరోయిన్లు కూడా..!

-

ప్రముఖ స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా వాణీ విశ్వనాథ్ కి ఒక తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా భారీ పాపులారిటీ లభించింది. అన్ని భాషల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్న వాణీ విశ్వనాథ్ అప్పట్లోనే పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అయింది. ఇకపోతే రెండు మూడు సంవత్సరాలుగా రాజకీయాలలో కొనసాగుతోంది. ఇక మొన్నటికి మొన్న నగరి ఎమ్మెల్యే రోజా పైన తాను పోటీ చేస్తానని అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

అయితే ఓట్లు మాత్రం తనకే వేయాలి అని తాను అధికారంలోకి వస్తే నగరి ప్రజలకు మంచి చేస్తానని కూడా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన వాణీ విశ్వనాథ్ కొంతకాలం క్రితం జయ జానకి నాయక అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలోకి వాణీ విశ్వనాథ్ వారసురాలు అడుగు పెట్టబోతోంది అంటూ వార్తలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె ఎవరో కాదు వాణీ విశ్వనాథ్ చెల్లెలు ప్రియా విశ్వనాథ్ కుమార్తె వర్ష విశ్వనాథ్.ఈమె టాలీవుడ్ లో సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజు సాలూరి సరసన హీరోయిన్ గా నటిస్తోంది అని.. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది అంటే కూడా వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

ఇకపోతే తమిళంలో మూడు సినిమాలలో నటించిన ఈమె రెడ్డిగారి ఇంట్లో రౌడీయిజం తో పాటు రాజీవ్ సినిమాలో కూడా నటించింది. మరి ఈ సినిమా ఫలితాలు మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. అయితే వర్ష విశ్వనాథ్ మాత్రం చూడడానికి చాలా అద్భుతంగా.. హీరోయిన్ల గురించి అందంతో ఉందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈమె సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా తన పెద్దమ్మ లాగే సక్సెస్ అవుతుందని అందరూ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news