24 కిస్సెస్ ట్రైలర్.. హెబ్భా రెచ్చిపోయిందిగా..!

-

కుమారి 21ఎఫ్ తో యూత్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హెబ్భా పటేల్ మరోసారి తన సత్తా చాటేలా రెచ్చిపోయి చేసిన సినిమా 24 కిస్సెస్. అయోధ్య కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఆదిత్ అరుణ్, హెబ్భా పటేల్ జంటగా నటించారు. సినిమాలో అమ్మడి లిప్ లాక్స్ హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. మొన్నమధ్య టీజర్ తో సర్ ప్రైజ్ చేయగా లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ హంగామా మొదలైంది.

అదిత్, హెబ్భా కిస్సులాట యూత్ ఆడియెన్స్ కు కిక్ ఎక్కిస్తుంది. సినిమా ట్రైలర్ లో కంటెంట్ కూడా ఉదనిపిస్తుంది. సినిమాలో హీరో, హీరోయిన్ తో పాటుగా రావు రమేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది. ఆయన డైలాగ్స్ కూడా బాగున్నాయి. ట్రైలర్ లో అద్వైతాన్నైనా అర్ధం చేసుకోవచ్చు కాని ఆడదాన్ని మాత్రం అర్ధం చేసుకోలేం అన్న ఎస్వీయార్ డైలాగ్ ను రిపీట్ చేశారు రావు రమేష్.

సినిమా ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. చూస్తుంటే కుమారి హెబ్భాకి ఈ 24 కిస్సెస్ మళ్లీ క్రేజ్ తెచ్చిపెట్టేలా ఉంది. సెప్టెంబర్ 13న భారీ సినిమాల మధ్య ఈ సినిమా వస్తుంది. మిణుగురులు సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అయోధ్య కుమార్ సెకండ్ మూవీగా బోల్డ్ అటెంప్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version