మాటల మాంత్రికుడు త్రివిక్రం ఎవరితో గొడవలు పెట్టుకునే వాడు కాదు.. తనపనేదో తాను చూసుకుని వెళ్లే త్రివిక్రం ఓ విషయంలో మాత్రం నటి హేమను హర్ట్ చేశాడట. అందుకే త్రివిక్రం సినిమాల్లో తప్పకుండా ఉండాల్సిన హేమ ఈమధ్య ఛాన్సులు మిస్ అవుతూ వస్తుంది. దానికి కారణం త్రివిక్రం, హేమల మధ్య ఓ చిన్న డిస్టబెన్స్ అని తెలుస్తుంది. తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడటానికి తనకేం అధికారం ఉంది.
అసలు తన రెమ్యునరేషన్ డిసైడ్ చేయడానికి అతనెవరు అంటూ త్రివిక్రం పై తన అసంతృప్తి భావజాలాన్ని బయట పెట్టింది హేమ. మేనేజర్, ప్రొడ్యూసర్ తీసుకోవాల్సిన రెమ్యునరేషన్ విషయంపై త్రివిక్రం మాట్లాడిన తీరు తనని ఇబ్బంది పెట్టిందని అప్పటినుండి ఆయన సినిమాలు తాను చేయట్లేదని చెప్పుకొచ్చింది హేమ. అప్పటి నుండి త్రివిక్రం తో హేమ మాట్లాడట కూడా ఆపేసిందట. మరి హేమ విషయంపై త్రివిక్రం స్పందిస్తాడా.. ఒకవేళ స్పందించినా ఎలా స్పందిస్తాడు అన్నది తెలియాల్సి ఉంది.