BREAKING: పవన్‌కళ్యాణ్‌తో అల్లు అర్జున్ భేటీ?

-

Hero Allu Arjun to meet AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తో హీరో అల్లు అర్జున్ భేటీ కానున్నారనే ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ చోటుచేసుకున్న పలు పరిణామాలు వీరి మధ్య గ్యాప్ పెంచాయి. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మొత్తం బన్నీని దూరం పెట్టినట్టు వార్తలు కూడా వచ్చాయి.

Hero Allu Arjun to meet AP Deputy CM Pawan Kalyan

ఒకవేళ బన్నీ.. పవన్‌ భేటీ కానున్నారనే వార్తలు నిజమైతే. జనసైనికులు దీనిని ఖండిస్తారా? లేదా కలుపుకుపోయే ప్రయత్నం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా..  మెగాహీరో సాయితేజ్​ అల్లు అర్జున్​, స్నేహా రెడ్డిని అన్​ఫాలో చేశారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే  అల్లుశిరీశ్​ను మాత్రం ఆయన ఫాలో అవుతున్నారు.  ఇప్పటికే సోషల్​ మీడియాలో మెగాఫ్యాన్స్ వర్సెస్ అల్లుఫ్యాన్స్ గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. బన్నీ ఎన్నికల్లో పవన్​కు సోషల్​మీడియా ద్వారా మద్దతు తెలిపి వైసీపీ అభ్యర్థి కోసం ఇంటికి వెళ్లి మరీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నెట్టింట ఫ్యాన్ వార్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news