కేఆర్ఎంబీ పై విచారణ ఆగస్టు 20కి వాయిదా..!

-

కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 20కి వాయిదా పడింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుపుతూ ఆగస్టు 20లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని సోలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.

ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి తీసుకు వచ్చే విషయంలో రెండు ప్రభుత్వాల అభిప్రాయాలతో కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఇరు రాష్ట్రాలు కోరాయి. దీంతో నోటిఫికేషన్ జారీకి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని, కేంద్రం నుంచి సూచనలు తీసుకోవాల్సి ఉందని ఏఎస్పీ ఐశ్వర్య భాటియా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. మరోవైపు ఇటీవలే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే వారు కృష్ణానది  వాటర్ గురించి కూడా చర్చించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news