మెగాస్టార్, సూపర్ స్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన RX 100 హీరో…..!!

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు RX 100 అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ గుమ్మకొండ, తొలి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మొదట్లో చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ అందుకుంది ఆ సినిమా. ఆ తరువాత రెండు సినిమాల్లో హీరోగా మరియు నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించిన కార్తికేయ, తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించాడు.

ఇక ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సినిమా 90ML. చిన్నప్పటి నుండి ఒక అరుదైన వ్యాధితో బాధపడే హీరోకు, నిత్యం కనీసం 90ML మందు తాగనిదే అతడు బ్రతికే పరిస్థితి ఉండదు. ఆ విధమైన వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఎంతో గ్రాండ్ గా జరిగింది. సందీప్ కిషన్, అజయ్ భూపతి సహా ఆ సినిమా యూనిట్ మొత్తం పాల్గొన్న ఈ వేడుకలో హీరో కార్తికేయ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి.
తొలి సినిమా నుండి తనను ఎంతో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాడు కార్తికేయ. మంచి సినిమాలు చేస్తే

తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమాను ఎంచుకోవడం జరిగిందని, మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ ప్రధానంగా సాగిన ఈ స్టోరీకి ప్రతి ప్రేక్షకుడు కానెక్ట్ అవుతాడని కార్తికేయ అన్నారు. ఇక తాను హీరో కావడానికి స్ఫూర్తినిచ్చింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అని, మొదటి నుండి ఎక్కువగా వారి సినిమాలే తాను చూస్తూ పెరిగానని, నిజమైన హీరోలకు వారిద్దరే నిదర్శనం అని కార్తికేయ కామెంట్ చేయడం జరిగింది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమా, ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది…..!!