ఏపీ అవినీతిలో.. టాప్‌లో నిలిచిన జిల్లా ఇదే..

-

లంచం ఇవ్వనిదే పని కావటం లేదనే అభిప్రాయం పలు రాష్ట్రాల్లో వ్యక్తం అవుతోంది. ఇక అవినీతి ఏ స్థాయిలో ఉందనే అంశం మీద జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో అవినీతి రహిత పాలన అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ గతంలోనే ప్రకటించారు. ఈ క్ర‌మంలోనే ప్రభుత్వ శాఖల్లో లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందించటానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌ ఐఐఎంతో ఒప్పందం చేసుకుంది. మరోవైపు ప్రజలు నేరుగా ప్రభుత్వ కార్యాలయాల్లో చోటుచేసుకునే అవినీతిపై ఫిర్యాదు చేయండి, బాధ్యులైన యంత్రాంగం భరతం పడతామని కొత్తగా ‘14400’ కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే.. ఈ కాల్ సెంటర్‌కు గుంటూరు జిల్లా నుంచి విపరీతమైన కాల్స్ వస్తున్నాయట. అది కూడా.. అవినీతిపై.. అందులోనూ.. రెవెన్యూ, విద్యుత్, పురపాలక అధికారులపై ఎక్కువగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయట. గత మూడు రోజుల్లో జిల్లాలో ఆయా శాఖల్లో ఉద్యోగులు పీడిస్తున్న లంచాలపై 200 కాల్స్‌కు పైగా రావటమే దీనికి నిదర్శనం. కాల్‌సెంటర్‌కు అందుతున్న ఫిర్యాదులను జిల్లాల వారీగా పంపి వాటిపై చర్యల నివేదిక కోరుతోంది. కాగా, గుంటూరు జిల్లా నుంచి వెళ్లిన ఫిర్యాదుల్లో 70 శాతం ఒక్క రెవెన్యూశాఖలో అవినీతిపైనే ఉన్నాయని గుర్తించారు. ఆ తర్వాత విద్యుత్తు, పురపాలకశాఖలు ఉన్నాయి. పంచాయతీరాజ్‌, జలవనరులు, వ్యవసాయ, పోలీసుశాఖల్లో అవినీతిపైనా ఫిర్యాదులు వచ్చాయని అధికారవర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news