తిరుపతిలో పెళ్లి చేసుకుంటా – ప్రభాస్

-

త్వరలోనే తిరుపతిలో పెళ్లి చేసుకుంటానని టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రకటన చేశారు. నిన్న ఆదిపురు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ…రామయణం చేస్తున్నావా? అని చిరంజీవి గారు అడిగారు.. అది అదృష్టం అన్నారు.

అందరికీ దొరకదు ఆ అదృష్టం.. నీకు దొరికిందని చెప్పారన్నారు హీరో ప్రభాస్‌. ఏడాదికి రెండు సినిమాలు చేస్తా.. కొంచెం మాట్లాడుతా.. సంవత్సరానికి మూడు సినిమాలు కూడా రావొచ్చు.. స్టేజ్‌పై కొంచెం మాట్లాడుతా.. ఎక్కువ సినిమాలు చేస్తానని ప్రకటన చేశారు హీరో ప్రభాస్‌. సినిమా కోసం టీమ్‌ మొత్తం రోజుకు దాదాపు 20 గంటలు కష్టపడ్డారు.. ఓం రావత్‌ ఓ యుద్ధమే చేశాడు.. నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు.. ఆదిపురుష్‌ చేయడం మా అదృష్టం అన్నారు ప్రభాస్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news