సోనాక్షి సిన్హాతో డేటింగ్‌పై ఆ హీరో రియాక్షన్ ఇదే..

-

బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా..బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ సుందరి..చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది. అయితే, ఈ సుందరి తనపైన సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వస్తున్నా పట్టించుకోదు.

సోనాక్షి సిన్హా, హీరో జహీర్ ఇక్బాల్ లు డేటింగ్ లో ఉన్నారని చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. కానీ, ఈ విషయమై హీరోయిన్ సోనాక్షి కాని హీరో జహీర్ కాని స్పందించలేదు. తాజాగా ఈ విషయమై ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు జహీర్.

తాను ఇటువంటి పుకార్ల గురించి పట్టించుకోబోనని హీరో జహీర్ తెలిపారు. తాను అస్సలు ఆ వార్తల గురించి ఆలోచించబోనని, మీరు ఏది అనుకుంటే అది అనుకోండని అన్నాడు జహీర్.

తాను ఆమెతో ఉండటం మీకు సంతోషాన్ని కలిగిస్తుందా? అయితే, తనను క్షమించండి..దాని గురించి ఆలోచించడం మానేయండని జహీర్ సూచించాడు. ఇటువంటి న్యూస్ గురించి పట్టించుకోవద్దని సల్మాన్ ఖాన్ చెప్పాడని వివరించాడు జహీర్. జహీర్ ఇక్బాల్ ‘నోట్ బుక్’ పిక్చర్ తో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news