బీజేపీ నేత‌పై హీరో సిద్ధార్థ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అందుకేనా!

-

హీరో సిద్ధార్థ స‌మాజంలో జ‌రుగుతున్న విష‌యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తుంటారు. ఇక బీజేపీపై ఒంటికాలుతో లేస్తుంటారు. ఇప్ప‌టికే ఎన్నో సార్లు త‌న ట్విట్ట‌ర్ ద్వారా బీజేపీపై విమ‌ర్శ‌లు చేశారు. ఇక తాజాగా కూడా త‌న కుటుంబంపై బీజేపీ నాయ‌క‌లు అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

తాను ఎవ‌రికీ బెద‌ర‌న‌ని అందుకు త‌గ్గ‌ట్టు ఆయ‌న కూడా విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు మరోసారి వార్త‌లో నిలిచారు సిద్ధార్థ‌. ఈ సారి ఏకంగా త‌మిళ‌నాడు బీజేపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిపై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెట్టారు.

విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ట్విట్ట‌ర్ లో హీరో సిద్ధార్థ్ సినిమాల‌కు దావూద్ ఇబ్ర‌హీం డ‌బ్బులు ఇస్తున్నాడా అంటూ రాసుకొచ్చారు. ఇక దీనిపై సిద్ధార్థ ఘాటుగా స్పందించారు. లేదురా దావూద్ కు అంత‌టైమ్ లేదు. నేను సంపూర్ణ పౌరుడిని. వెళ్లి ప‌డుకోరా. ఇంక బీజేపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి అంట సిగ్గుండాలి అని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ప్ర‌స్తుతం ఈ కామెంట్లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news