మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్న జర్నీ హీరో..

తమిళం నుండి తెలుగులోకి అనువాదమైన జర్నీ, రాజారాణీ చిత్రాల ద్వారా పరిచయమైన జై ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్నాడు. హీరోయిన్ అంజలితో కొన్ని రోజులు రిలేషన్ షిప్ లో ఉండి ఆ తర్వాత సెపరేట్ అయ్యి, ఇద్దరూ వారి వారి పనుల్లో బిజీ అయిపోయారు. ఇటు అంజలి తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటిస్తుంది. ఇటీవలే అంజలి నటించిన నిశ్శబ్దం సినిమా అమెజాన్ లో రిలీజైంది.

అటు జై తమిళ చిత్రాల్లో మెరుస్తున్నాడు. తాజాగా జై ముఖ్య పాత్రలో సుసీందిరన్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి జై, స్వరాలు సమకూరుస్తున్నాడు. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా మారడం సహజమే. కానీ హీరో, తన సినిమాకి తానే సంగీతం అందించడం చాలా అరుదు. ఐతే లండన్ లో సంగీతం నేర్చుకున్న జైకి అది పెద్ద విషయం కాదు. ఇప్పటి వరకూ తెరమీద తన నటనతో మరిపించిన జై, తనలోని మ్యూజిక్ టాలెంట్ తో అబ్బురపరుస్తాడేమో చూడాలి.